న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ ఇప్పుడు కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నది. సెంట్రల్ విస్టా అవెన్యూను ఇప్పుడు మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ విస్టాకు చెందిన ఫోటోలను తాజాగా రిలీజ్ చేశారు. రీడెవలప్ చేసిన ఆ ప్రాంతం ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఐస్ క్రీం బండ్లు, వీధి వ్యాపారుల కోసం కూడా కొత్త వెండింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. సెంట్రల్ విస్టా అవెన్యూ సుమారు రెండు కిలోమీటర్ల పొడువు ఉంటుంది. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సెంట్రల్ విస్టాను అద్భుతంగా తయారు చేశారు. సెప్టెంబర్ 8వ తేదీన ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ప్రజల సందర్శనకు ఉంచుతారు. ఇండియా గేట్ నుంచి మన్ సింగ్ రోడ్డు వరకు ఉన్న లాన్స్‌లో పిక్నిక్లను అనుమతించడం లేదు. లాన్స్ వద్ద ఉన్న చిన్న చిన్న కెనాల్స్‌పై 16 పర్మినెంట్ బ్రిడ్జ్‌లను కట్టారు.