Viral Video | తాజ్ మహల్‌ను చూసేందుకు వచ్చిన టూరిస్ట్‌పై దాడి..అసలు ఏం జరిగిందంటే..!
తాజ్‌మహల్ అందాలను వీక్షించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఓ టూరిస్ట్‌ను (Viral Video) కొందరు భక్తులు వెంటాడి లాఠీలు, రాడ్లతో కొట్టిన ఘటన కలకలం రేపింది. దాడికి పాల్పడిన వారిలో ఒకరికి టూరిస్టు కారు తగిలిందనే నెపంతో వారు బాధితుడిపై దాడికి తెగబడ్డారు.
లక్నో : తాజ్‌మహల్ అందాలను వీక్షించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఓ టూరిస్ట్‌ను (Viral Video) కొందరు భక్తులు వెంటాడి లాఠీలు, రాడ్లతో కొట్టిన ఘటన కలకలం రేపింది. దాడికి పాల్పడిన వారిలో ఒకరికి టూరిస్టు కారు తగిలిందనే నెపంతో వారు బాధితుడిపై దాడికి తెగబడ్డారు. సోమవారం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు ట్విట్టర్ యూజర్లు ఈ క్లిప్‌ను యూపీ పోలీసులకు ట్యాగ్ చేయడంతో తాజ్‌గంజ్ పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
Video from Agra . Tourist Beaten by Locals. #shameful #SeemaHaider #KiritSomaiya #Agra #DelhiFloods pic.twitter.com/zuXq7qdwLN
— देश सर्वप्रथम (@deshsarvpratham) July 18, 2023
ఆగ్రాలోని తాజ్‌గంజ్ ప్రాంతం బసై చౌకిలో ఈ ఘటన జరిగింది. బాధిత టూరిస్ట్‌పై దాడి జరిగిన స్వీట్ షాప్‌లోని సీసీటీవీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. టూరిస్ట్ క్షమాపణలు కోరినా నిందితులు వినిపించుకోకుండా అతడిపై దాడి చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. బాధితుడిని దారుణంగా కొడుతూ చాలా సేపు అతడిని నిందితులు వేధించడం చూడొచ్చు.
ఈ ఘటనపై తాము సత్వరమే స్పందించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు ట్వీట్ చేశారు. దాడికి పాల్పడిన మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ ఘటనపై విస్మయం వ్యక్తం చేసిన సోషల్ మీడియా యూజర్లు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దాడికి తెగబడిన వారికి కూడా ఇదే రీతిలో బుద్ధిచెప్పాలని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఆగ్రా పోలీసులు సరైన విధంగా స్పందించి నిందితులకు బుద్ధి చెప్పారని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Cyber Fraud | ఫేక్ ఈ-మెయిల్‌తో పుణే కంపెనీకి రూ. 22 లక్షలు కుచ్చుటోపీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

