Road accident : నడిరోడ్డుపై డైరెక్షన్ బోర్డును ఢీకొట్టి ఓ కంటెయినర్ (Container) తగులబడిపోయింది. ఆ ఘటనలో ఆ కంటెయినర్ డ్రైవర్ (Driver) సజీవదహనమయ్యాడు. రాజస్థాన్ (Rajasthan) లోని దౌసా జిల్లా (Dausa district) దుంగార్పూర్ (Dungarpur) సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే (Delhi-Mumbai express way) పైన రవాస్ పోలీస్‌స్టేషన్ (Rawas police station) పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కంటెయినర్ నాన్-వెజ్ ఫుడ్ ఐటమ్స్ లోడుతో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. కంటెయినర్ సూచిక బోర్డును తగులగానే ఆ బోర్డు అమాంతం రోడ్డుపై కూలిపోయింది. ఆ వెంటనే కంటెయినర్ మంటలు చెలరేగాయి. క్షణాల్లో అంతా జరిగిపోయింది. డ్రైవర్‌కు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో సజీవదహనం అయ్యాడు.