DK Shivakumar : కర్ణాటక (Karnataka) లో సిద్ధరామయ్య (Siddaramaiah) ను సీఎం పదవి నుంచి తొలగించి ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) కు ఆ పదవిని కట్టబెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కర్ణాటక కాంగ్రెస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తాజాగా పార్టీ జాతీయాధ్యక్షుడు (National president) మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తో డిన్నర్లో పాల్గొనడం ఈ ఊహాగానాలకు తెరతీసింది.
అయితే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ డ్రామాకు తెరదించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యేనని చెప్పారు. పూర్తికాలం ఆయనే సీఎంగా కొనసాగుతారని చెప్పారు. తామంతా ఆయనతో కలిసి పని చేస్తామని అన్నారు. ఖర్గేతో ఎమ్మెల్యేల సమావేశం గురించి ప్రశ్నించగా.. వాళ్లు పీసీసీ అధ్యక్ష పదవి, నాలుగైదు డిప్యూటీ సీఎం పదవులను కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి మీటింగ్లు గత రెండున్నరేళ్లుగా కొనసాగుతున్నాయని డీకే చెప్పారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదని అన్నారు. వాళ్లు ఇలాంటి మీటింగ్లు ఇంకా మరిన్ని పెట్టుకోనీయని వ్యాఖ్యానించారు.