యమునా నదిలో కాలుష్యం నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
యమునా నదిలో కాలుష్యం నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం | యమునా నదిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌ను సర్కారు నిషేధించింది.

న్యూఢిల్లీ : యమునా నదిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌ను సర్కారు నిషేధించింది. యమునా నదిలో కాలుష్యాన్ని నివారించడానికి నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల విక్రయాలను నిషేధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యమునా మానిటరింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బ్యాన్ విధించింది. సంబంధిత విభాగాలపై నియంత్రణ ఉన్న స్థానిక సంస్థలు, పౌర సరఫరా విభాగాలు, జిల్లా పరిపాలన సహా సంబంధిత అధికారులందరూ నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, ఈ మేరకు తనిఖీలు చేపట్టాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నెలవారీగా సంబంధిత నివేదికలను సమర్పించాలని కాలుష్య నియంత్రణ సంస్థ అధికారులను కోరింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జనవరిలో ఇద్దరు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసులను అంగీకరించింది. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా లేని డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌ను నిషేధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల వినియోగించడంతో కలిగే హానికరమైన ప్రభావం గురించి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని ఎన్జీటీ ఢిల్లీ ప్రభుత్వాన్ని సూచించింది.
యమునా నది కాలుష్యానికి ప్రధాన కారణాల్లో సబ్బులు, డిటర్జెంట్లు సైతం కారణమని నిపుణులు పేర్కొన్నారు. చాలా సార్లు ఢిల్లీలో యమునా నదిలో తేలియాడే విషపూరితమైన నురుగు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. అధిక ఫాస్పేట్ కంటెంట్ ఉన్న రంగు పరిశ్రమలు, ధోబీ ఘాట్లు, గృహాల్లో ఉపయోగించే సబ్బులు, డిటర్జెంట్లతో యమునా నది నీటిలో విషపూరిత నురుగు ఏర్పడిందని ప్రధాన కారణమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు
Delta effect : బ్రిటన్‌లో జూలై 19 వరకు ఆంక్షల పొడగింపు
నేడు కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

