ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్ కోసం సరికొత్త జెర్సీని శనివారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ, హార్డిక్ పాండ్య, పొలార్డ్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఫాస్ట్ బౌలర్ బుమ్రాతో పాటు ముంబై అభిమానులు ఉన్నారు. కొత్త జెర్సీని ప్రముఖ డిజైనర్లు శంతను, నిఖిల్ రూపొందించారు. వన్ టీమ్. వన్ ఫ్యామిలీ, వన్ జెర్సీ. ఐపీఎల్ 2021 కోసం ముంబై కొత్త జెర్సీని ఆవిష్కరిస్తున్నామంటూ ముంబై ట్వీట్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 9న ఆరంభంకానుంది.
One Team. #OneFamily. One Jersey. 💙
— Mumbai Indians (@mipaltan) March 27, 2021
Presenting our new MI jersey for #IPL2021 👕✨
Paltan, pre-order yours from @thesouledstore now – https://t.co/Oo7qj5m4cN#MumbaiIndians pic.twitter.com/F0tBT6TXcq