మధిరరూరల్, మే 1: వీధి కుక్కల దాడిలో దుప్పి మృత్యువాతపడింది. ఈ ఘటన ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఖమ్మంపాడులో చోటుచేసుకొన్నది. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పొలాల్లోకి దుప్పి రాగా కుక్కలు వెంబడించి దాడి చేశాయి. అప్పటికే అక్కడికి వచ్చిన ఓ రైతు కుక్కలను తరిమాడు. సమాచారం అందుకొన్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దుప్పిని మధిరలోని ప్రభుత్వ వెటర్నరీ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.