పుణె : నీట్-యూజీ పేపర్ లీక్ సహా విద్యా వ్యవస్థలో నెలకొన్న వైఫల్యాలకు బాధ్యత ఎవరు వహిస్తారన్నది తేల్చాలని సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు దీప్కే అన్నారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, విద్యా వ్యవస్థలో వైఫల్యాలను నిరసిస్తూ సీజేపీ దేశవ్యాప్త ఆందోళనను గురువారం పుణె నగరం నుంచి ప్రారంభించింది.
ఈ సందర్భంగా వేలాదిగా హాజరైన యువతను ఉద్దేశించి దీప్కే ప్రసంగించారు. భారతదేశ విద్యారంగాన్ని తీర్చిదిద్దటంలో పుణెకు ఉన్న చారిత్రక పాత్ర, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు జాతీయ స్థాయికి చేరుకోవటం వంటి కారణాల వల్ల ఈ నగరాన్ని ఎంచుకున్నట్టు దీప్కే చెప్పారు.