సోనిపట్: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ (38) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హర్యానాలోని సోనిపట్ దగ్గర మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి భటిండా వైపు కుండ్లీ-మానెసార్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తుండగా.. నిలిపి ఉంచిన ఓ లారీని ఆయన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు మిత్రులతో కలిసి సిద్ధూ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిద్ధూతో పాటు ఒక రు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. సాగు ఉద్యమం సమయంలో గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనల్లో కీలక నిందితుడిగా ఉన్నారు.