నేరాల పడగ నీడలో!
ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండాలి. భిన్నాభిప్రాయాలకు అవకాశం లభించాలి. అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులకు భరోసా ఉండాలి. కానీ ఇవాళ భారతదేశంలో ఈ ప్రాథమిక ప్రజాస్వామిక విలువలకే పరీక్ష ఎదురవుతున్నది. ఒకవైపు మతం, కులం, భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు ప్రాధాన్యత పెరుగుతున్నది. మరోవైపు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే విద్యార్థులు, యువత, ప్రజా సంఘాలపై పోలీసు, పారా మిలిటరీ బలగాలు ప్రయోగిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండాలి. భిన్నాభిప్రాయాలకు అవకాశం లభించాలి. అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులకు భరోసా ఉండాలి. కానీ ఇవాళ భారతదేశంలో ఈ ప్రాథమిక ప్రజాస్వామిక విలువలకే పరీక్ష ఎదురవుతున్నది. ఒకవైపు మతం, కులం, భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు ప్రాధాన్యత పెరుగుతున్నది. మరోవైపు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే విద్యార్థులు, యువత, ప్రజా సంఘాలపై పోలీసు, పారా మిలిటరీ బలగాలు ప్రయోగిస్తున్నారు.
వెరసి దేశంలో ప్రజాస్వామిక విలువలు, స్వేచ్ఛ పరిస్థితి ఏమిటని ప్రశ్న తలెత్తుతున్నది. తాజా జాతీయ నేర గణాంకాలు దేశ పరిస్థితిని సమగ్రంగా వివరించకపోయినా, కొన్ని కీలకమైన హెచ్చరికలను మాత్రం ఎత్తిచూపుతున్నాయి. దేశంలో అల్లర్లు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు, వరకట్నమరణాల వంటి సాంప్రదాయిక నేరాలు ఓ మోస్తరు వరకు (సగటున సుమారు 6 శాతం) తగ్గినట్టు చూపిస్తున్నాయి. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన న్యాయ సంహిత ప్రకారం నేరాల నిర్వచనం స్వల్పంగా మారడమే ఇందుకు కారణమనే వాదనలు న్నాయి. అదే సమయంలో సైబర్ నేరాలు, పిల్లలపై (5.9%), వృద్ధులపై (16.9%) అత్యాచారాలు, దారుణాలు పెరుగుతున్నాయి.
ఇక విద్వేష నేరాలైతే తారస్థాయికి చేరుకున్నాయి. ఎన్డీయే పదేండ్ల పాలనలో 1,743 మూకదాడి హత్యలు జరిగాయని ఓ అంచనా. అంటే రెండు రోజులకు ఓ వ్యక్తి మూకదాడిలో హతుడయ్యాడన్నమాట. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. విద్వేషాన్ని రెచ్చగొట్టేవారు యథేచ్ఛగా నేరాలకు పాల్పడటమే కాకుండా తర్వాత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. చట్టం ఎంత నిష్పక్షపాతంగా పనిస్తున్నది? బాధితులకు న్యాయం ఎంత త్వరగా అందుతున్నది? అనేది ఇక్కడ ప్రశ్న. అధికార రాజకీయాలకు దగ్గరగా ఉన్నవారికి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయం అమలవుతున్నదనే వా దనలకు సమాధానాలు లభించాల్సి ఉన్నది. చట్టం ముందు అందరూ సమానులనే రాజ్యాంగ సూత్రం ఆచరణలో కనిపించాలి.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేండ్ల కాలంలో శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పోలీసు వ్యవస్థ పనితీరు నానాటికీ తీసికట్టు అవుతున్నది. 2026 పోలీసు సమీక్ష ప్రకారం, 202324లో నమోదైన 2,65,377 కేసులు 202526 నాటికి 2,84,363కు చేరాయి. ఈ మూడేండ్ల వ్యవధిలో మొత్తం కేసుల సంఖ్య 7.15 శాతం పెరిగింది. వ్యవస్థీకృత నేరాలు 25 నుంచి 451కి, మాదకద్రవ్యాల కేసులు 2,026 నుంచి 2,960కి పెరగడం ఆందోళనకరం. ఎన్సీఆర్బీ 2024 గణాంకాలపై వచ్చిన విశ్లేషణ ప్రకారం, తెలంగాణలో మహిళలపై నేరాల రేటు లక్ష మంది మహిళలకు 128.6గా ఉన్నది. జాతీయ సగటు 64.6తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది హెచ్చరిక కావాలి. తెలంగాణలో మాదకద్రవ్యాల కేసులు మూడేండ్ల వ్యవధిలో 46 శాతానికి పైగా పెరగడం రాష్ట్రం ఎటుపోతున్నదో అనే ఆందోళన కలిగిస్తున్నది.
ముఖ్యమంత్రి స్వయంగా హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నా పోలీసు వ్యవస్థ పనితీరు, నేరాల దర్యాప్తు తీరు, ప్రజల భద్రతపై ప్రభుత్వ జవాబుదారీతనం ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రతిపక్షాలను విమర్శించడంలో చూపించే ఉత్సాహం ప్రజల భద్రత విషయంలోనూ కనిపించడంలేదు. అయిందానికీ కానిదానికీ రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం, గత ప్రభుత్వాన్ని నిందించడం కంటే ప్రస్తుత పాలనలో నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? వాటిని అరికట్టడానికి ఏమి చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రశ్నించేవారిపై కేసులు, అరెస్టులు అంటూ వేధింపులు మాని, విద్వేష నేరాల నియంత్రణకు, నిరసనకారుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చర్యలు చేపట్టాలి. విద్వేష ప్రసంగాలపై, హింసను ప్రేరేపించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రజల మధ్య విద్వేషాలను పెంచే శక్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ, శాంతియుతంగా ప్రశ్నించే విద్యార్థులపై కఠినంగా వ్యవహరించే ద్వంద్వ వైఖరి ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. విద్వేషాన్ని రెచ్చగొట్టేవారికి స్వేచ్ఛ, అన్యాయాన్ని ప్రశ్నించేవారికి సంకెళ్లు.. ఇదే గనుక దేశంలో సాధారణ పరిస్థితిగా మారితే ప్రజాస్వామ్యానికి అర్థమే మిగలదు.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

