వాస్తు కళాభిమానులు-సంపన్నరాజ్య పాలకులు
కుతుబ్‌షాహీల పరిపాలన కాలంలో గోల్కొండ రాజ్యంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. వ్యవసాయ శిస్తు ప్రధాన ఆదాయవనరు. వజ్రాల గనుల నుంచి కూడా ఆదాయం వచ్చేది. గోల్కొండ రాజ్యం అత్యంత సంపన్నమైనది. స్థానిక ప్రజల సంప్రదాయాలను గౌరవించిన కుతుబ్‌షాహీలు
- తెలంగాణ చరిత్ర
కుతుబ్‌షాహీల పరిపాలన కాలంలో గోల్కొండ రాజ్యంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. వ్యవసాయ శిస్తు ప్రధాన ఆదాయవనరు. వజ్రాల గనుల నుంచి కూడా ఆదాయం వచ్చేది. గోల్కొండ రాజ్యం అత్యంత సంపన్నమైనది. స్థానిక ప్రజల సంప్రదాయాలను గౌరవించిన కుతుబ్‌షాహీలు వాస్తు కళాభిమానులు. వీరు అనేక కట్టడాలను నిర్మించారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేశారు.
కుతుబ్‌షాహీలు తమ పాలనాకాలంలో రాష్ట్రాలను తరఫ్ లేదా సిమ్త్లుగా విభజిం చారు. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో 6 తరఫ్‌లు ఉండేవి. అబ్దుల్లా తానీషా కాలంలో మొత్తం 37 సర్కారులు 517 పరగణాలు ఉండేవని డచ్ కంపెనీ రికార్డుల వల్ల తెలుస్తుంది. రేవు పట్టణంలో ఉన్నతాధి కారిని షాబందర్ అనేవారు. భూమి శిస్తు వసూలు అధికారాన్ని వేలం పాటలో అందరికంటే ఎక్కువ డబ్బు చెల్లించేవారికే ఇచ్చేవారు. ఈ రకమైన హక్కులను కొన్నవారిని ముస్తజీర్లు అనేవారు. ముస్తజీర్లుగా హిందువులనే ఎక్కువ సంఖ్యలో నియమించారు. మచిలీపట్నం వార్షిక ఆదాయం ఒక లక్ష ఎనబైవేల పగోడాలు. దీనిలో ఐదువేల పగోడాలను సుల్తాన్ హవల్దార్ జీతంగా చెల్లించేవాడు. మూడు వేలు హవల్దార్ తన కింది ఉద్యోగులకు చెల్లింపుల కోసం తీసుకున్నాడు.
- పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలను సర్కార్లుగా విభజించారు. వీరి అనేక ఫర్మానాల్లో దేశ్‌పాండే, తానేదార్, దేశ్‌ముఖ్, కులకర్ణి మొదలైన రెవెన్యూ అధికారులు, ఉద్యోగులుండేవారు. వీరి కాలంలో గ్రామమే పరిపాలనా వ్యవస్థకు తొలిమెట్టు. గ్రామస్థాయిలో పెద్ద మఖుద్దుమ్. కులకర్ణి గ్రామ అకౌంటెంట్, దేశ్‌పాండే పరగణా స్థాయి అకౌంట్స్ అధికారి.
- గోల్కొండ కేంద్రంగా అవతరించిన కుతుబ్ షాహీలు బహమనీల సైనిక వ్యవస్థనే కొద్దిపాటి మార్పులతో ఆచరించారు. వీరు భారీ సైన్యాన్ని పోషించారు. సుల్తాన్ ఆధీనంలో సిద్ధ సైన్యం రాజధానిలో ఉండేది. సుల్తాన్ కులీ రాజ్యస్థాపన తొలిరోజుల్లోనే రాజ్య పటిష్టతకు బలోపేతమైన సైన్యాన్ని రూపొందించాడు. సైన్యంలో హిందూ, ముస్లిం, ఇరానీలు ఉండేవారు. కుతుబ్ షాహీల ఆదాయంలో ఎక్కువ భాగం సైన్యం పోషణకు, సైనికుల జీతభత్యాలకే సరిపోయేది.
రెవెన్యూ విధానం
- గోల్కొండ రాజ్యంలో కూడా వ్యవసాయం ప్రధాన జీవనాధారం. భూమి శిస్తే ఖజానాకు ముఖ్య ఆదాయ వనరు. కుతుబ్ షాహీలు అనేక విధాలుగా వ్యవసాయా భివృద్ధికి కృషిచేశారు. భూమి రికార్డుల్లో భూమి సాగుచేసే వ్యక్తిని రయ్యత్ అని పేర్కొన్నారు. రయ్యత్ నుంచే రైతు అనే పదం ఏర్పడిందని కొందరి పండితుల అభిప్రాయం. ఏ ముస్లిం పాలకులు కూడా భూమిపై రైతు సంపూర్ణ హక్కును గుర్తించలేదు. ఒక్క మాలిక్ అంబర్ మాత్రమే తన రాజ్యంలో (అహ్మద్ నగర్) మిరాశీ హక్కును గుర్తించాడు.
- కుతుబ్‌షాహీల కాలంలో భూమిశిస్తు, ఇతర పన్నులు, సుంకాలు అన్ని కలిపి 82,95,196 హొన్నుల ఆదాయం వచ్చేది. ఒక హొన్ను అంటే నేటి 3 రూపాయలకు సమానం. అంటే చిట్టచివరి గోల్కొండ సుల్తాన్అబ్దు ల్లా కుతుబ్‌షా కాలంనాటి మొత్తం రెయన్యూ రూ. 2,47,85,529. ఈ ఆదాయంలో అధిక భాగం తెలంగాణ ప్రాంతంలో ఉన్న సర్కార్ల నుంచి వచ్చేది. ఇదే కాకుండా వజ్రాల గనులు లీజుకు ఇవ్వటం వల్ల భారీ మొత్తంలో ఆదాయం వచ్చేది. పరిశ్రమల నుంచి, వర్తక వ్యాపారం వల్ల కూడా ఆదాయం వచ్చేది.
- న్యాయపాలన కుతుబ్‌షాహీలు న్యాయ నిర్వహణలో స్థానిక హిందూ ధర్మ సూత్రాలను, న్యాయకోవిదుల సలహాలను, సూచనలను తీసుకొని న్యాయపాలన చేశారు. గ్రామస్థాయి నుంచి సివిల్, క్రిమినల్ వివాదాల పరిష్కారానికి న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. ముస్లిం మతపెద్దలు ఖాజీలు, మౌల్వీలు, పండితులు కూడా న్యాయ నిర్వహణలో కీలకపాత్ర నిర్వహించారు. దాద్‌మహల్, అమన్ మహల్ వంటి న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. ఈ న్యాయస్థానాల్లో సమావేశమై వివిధ కేసులు విచారించి తీర్పు చేప్పేవారు. విదేశీ వర్తకుల, సరుకుల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- కుతుబ్‌షాహీల కాలంలో ప్రజలు హిందు వులు, పాలకులు ముస్లింలు, షియాలు. కుతుబ్‌షాహీలు స్థానిక ప్రజల సామాజిక వ్యవస్థను, మత ఆచారాలను గౌరవించారు. ఈ అంశమే వారి విజయానికి, ఖ్యాతికి కారణమైందని పండితుల అభిప్రాయం. సామాజిక మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోలేదు. దసరా, దీపావళి, హోళీ, రంజాన్, బక్రీద్, నవ్రోజ్, మొహర్రం ముఖ్య పండుగలు. హిందూ-ముస్లింలు సంఖ్యతతో వీటిని జరుపుకొనేవారు.
ఆర్థికం
- మధ్య యుగ దక్కన్లోలో వెలసిన ఐదు షియా రాజ్యాల్లో గోల్కొండ సంపన్న రాజ్యం. దీనికి కారణం రెండు అంశాలు. ఒకటి గోల్కొండ రాజ్యంలోని సహజ సంపద. ముఖ్యంగా అత్యంత విలువైన వజ్రాల గనులు, తీరాంధ్ర ప్రాంతంలోని సారవంతమైన భూములు నీటివసతులు. మచిలీపట్నం మధ్య ఆసియా కేంద్రంగా ఐరోపా దేశాలతో భారీ ఎత్తున కొనసాగిన విదేశీ వ్యాపారం.
- ప్రజలు సొంత భూములు, వ్యాపారాలు కలిగి ఉండేవారు. ప్రధానంగా వ్యవసాయమే ఎక్కువమంది ప్రజల వృత్తి. జమీందారి భూములు, హవేలీ భూములని రెండు రకాలుగా ఉండేవి. వ్యవసాయ పనులు జూన్ నుంచి అక్టోబర్ వరకు జరిగేవి. కోస్తా ప్రాంతంలో నీటి వసతులు పుష్కలంగా ఉన్నందువల్ల రైతాంగం మంచి లాభాలు గడించేవారు. తెలంగాణ ప్రాంతంలో పండ్లు, పూలు పుష్కలంగా పండించేవారు. హిందువులు వరి ఎక్కువగా పండించేవారు.
వ్యవసాయం నీటిపారుదల సౌకర్యాలు

కుతుబ్‌షాహీ సుల్తానులు, వారి అధికారులు రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయాన్ని పోత్సహించారు. తెలంగాణ ప్రాంతంలో పాత చెరువులకు, మరమ్మతులు చేయించారు. కొత్త బావులను, చెరువులను నిర్మించి కాకతీయుల కాలం నాటి చెరువులకు ఊపిరి పోశారు. ఇబ్రహీం కులీ కుతుబ్‌షాహీ కాలంలో అనేక కొత్త జలాశయాలు, చెరువులు నిర్మించబడ్డాయి. వీటిలో హుస్సేన్‌సాగర్, బుద్వేల్, ఇబ్రహీంపట్నం చెరువు మొదలైనవి ప్రసిద్ధమైనవి. గోల్కొండ కోటలోని నీటి అవసరాల కోసం కోటకు 5 కి.మీ. దూరంలో దుర్గ్ వద్ద ఒక జలాశయాన్ని నిర్మించారు. కుతుబ్‌షాహీలు గ్రామస్థాయి నుంచి తరఫ్ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో చెరువుల పరిరక్షణకు అధికారులను, ఉద్యోగులను నియమించారు. దేవాలయాలు, మసీదులు, గ్రామసభలు కూడా చెరువుల నిర్మాణానికి, పునరుద్ధరణలో క్రియాశీలక ప్రాత నిర్వహించేవి.
వర్తక వ్యాపారాలు
- వర్తక వ్యాపారాలు పెద్ద ఎత్తున జరిగేవి మేలు రకం గుర్రాలను పోర్చుగీసువారి నుంచి దిగుమతి చేసుకునేవారు. మచిలీపట్నం నుంచి మేలు వస్ర్తాలను ఎగుమతి చేసేవారు. విదేశీ వ్యాపారం సముద్రంపై ఓడల్లో జరిగేది.
- మోటుపల్లి, నరసాపురం, మచిలీపట్నం విదేశీ వ్యాపారానికి ముఖ్యకేంద్రాలుగా ఉండేవి. పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీశైలం, శ్రీకూర్మం, వరంగల్, శ్రీకాళహస్తి ఉదయగిరి పెద్ద వర్తక కేంద్రాలుగా ఎదిగాయి. పెరికలు వస్తు సామగ్రి రవాణాలో కీలకపాత్ర నిర్వహించేవారు.
పరిశ్రమలు
సమకాలీన తెలుగు రచనలు, కుతుబ్‌షాహీల ఫర్మానాల్లో గోల్కొండ రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు గురించి ప్రస్తావించాయి. వజ్రాలు, నేత, కలంకారీ అద్దకం, తివాచీ, నౌక నిర్మాణం, సురేకారం, ఇనుము-ఉక్కు మొదలైన పరిశ్రమల గురించి పేర్కొన్నాయి. ఈ పరిశ్రమల్లో పనిచేసే వారు వ్యవసాయరంగంతో పోలిస్తే చాలా తక్కువ మందికే ఉద్యోగావకాశాలు కల్పించారు.
వజ్రాల గనులు
గోల్కొండ గనుల్లో తవ్వి, శుద్ధిచేసిన వజ్రాలకు భారతదేశంలోనేకాక యావత్ ప్రపంచంలోనే విశేష గుర్తింపు ఉంది. కుతుబ్‌షాహీల రాజ్యంలో కృష్ణానదీతీరాన ఉన్న కొల్లూర్, కర్నూల్లోని రామళ్ళకోట వజ్రాలగని మేలు రకం వజ్రాలకు నిలయాలు. ఈ రెండు గనులు కుతుబ్‌షాహీల రాజ్యస్థాపనకు ముందే ఉన్నాయి. కోహినూర్ వజ్రం కొల్లూర్ గనిలో దొరికింది. వజ్రపుగనుల నుంచి లక్షల పగోడాల్లో ఆదాయం సుల్తాన్‌కు వచ్చేది.
నేత పరిశ్రమ
- గోల్కొండ రాజ్యంలో నేసిన వస్ర్తాలకు ఐరోపా మార్కెట్లలో మంచి గిరాకీ ఉండేది. ఆనాటి నేత కార్మికులు స్థానిక అవసరాలను తీర్చడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు సరఫరా చేసేవారు. నేతపనివారి నుంచి కాంట్రాక్టర్లు వస్ర్తాలను ముందుగానే అడ్వాన్సు చెల్లించి నేయించుకునేవారు. మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకొని అధిక లాభాలు ఆర్జించేవారు. అద్దకపు వస్ర్తాలను చిట్జ్, చిత్రాలు ముద్రించిన వస్ర్తాలను పింటాడో అనేవారు.
- గోదావరి నదీ తీరంలోని నర్సాపురం, భీమునిపట్నం, పులికాట్, మచిలీపట్నం నౌక నిర్మాణ కేంద్రాలుగా ఉండేవి. మేలురకం కర్ర, ఇనుము పెద్దసైజు ఓడల నిర్మాణంలో ఎక్కువగా వాడేవారు.
- గోల్కొండ రాజ్యంలోని మందుగుండు సామగ్రిలో ఉపయోగించే సురేకారం పరిశ్రమ ముఖ్యమైంది.
సాహిత్య కృషి - కుతుబ్‌షాహీల కాలంలో తెలుగు భాషను ఆదరించారు. తెలుగు కవులను పోషిం చారు. అద్దంకి గంగాధర కవి తన ‘తపతీ సంవవణోపాఖ్యానాన్ని’ సుల్తాన్‌కు అంకితం ఇచ్చాడు. పొన్నగంటి తెలగనాచార్యున్ని అమీన్‌ఖాన్ ఆదరించాడు. అతని యయాతి చరిత్రను అమీన్‌ఖాన్‌కు అంకితమిచ్చాడు. మహమ్మద్ కులీకుతుబ్‌షా ఆస్థాన కవి గణేష పండితుడు. అంతేకాక సారంగ తమ్మయ్య వంటివారిని ఆదరించారు. క్షేత్రయ్య కూడా వేయికి పైగా పదకీర్తనలు పాడాడు.
కళలు వాస్తు శిల్పం
- కుతుబ్‌షాహీ సుల్తానులు గొప్ప వాస్తు కళాభిమానులు. వీరి సమకాలీన మొఘల్ చక్రవర్తులు లాగా తమ రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో అద్భుతమైన నిర్మాణాలు చేశారు.
- వాటిలో కోటలు, దవాఖానాలు, మసీదులు, చెరువులు సరాయిలు మొదలైనవి ఉన్నాయి.
- వీరి నిర్మాణాల్లో ముఖ్యమైనవి

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

