Tecno Pova 8 | ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 39గంటలు నాన్‌స్టాప్ కాల్స్ మాట్లాడొచ్చు.. భారీ బ్యాటరీతో టెక్నో పోవా 8 లాంచ్!
Tecno Pova 8 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) తన కొత్త పోవా 8 ( Pova 8) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత ఏడాది వచ్చిన పోవా 7కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా తీసుకొచ్చిన ఈ మొబైల్ భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్ల, శక్తివంతమైన ప్రాసెసర్ వంటి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
Tecno Pova 8 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) తన కొత్త పోవా 8 ( Pova 8) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత ఏడాది వచ్చిన పోవా 7కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా తీసుకొచ్చిన ఈ మొబైల్ భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్ల, శక్తివంతమైన ప్రాసెసర్ వంటి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
భారత్‌లో పోవా 8 రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.29,999గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.31,999గా ఖరారు చేశారు. ఈ మొబైల్ 16 బిట్ వైట్, ప్లాస్మా ఆరెంజ్, టెర్మినల్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.
డిస్ప్లే – పనితీరు
డిస్ప్లే విషయానికి వస్తే పోవా 8 స్మార్ట్‌ఫోన్‌లో 6.76 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఐపీఎస్ స్క్రీన్‌ను అందించారు. 1080*2344 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటం వల్ల గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌ను మరింత స్మూత్‌గా ఆస్వాదించవచ్చు. 95 నిట్స్ వరకు బ్రైట్నెస్, 1500Hz టచ్ శాంప్లింగ్ రేట్, 91.29 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
పనితీరు విషయానికి వస్తే ఈ మొబైల్లో 6 నానోమీటర్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను అమర్చారు. Mali – G610 MC2 GPUతో జతకట్టిన ఈ చిప్సెట్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు మెరుగైన పనితీరును అందిస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ కారణంగా యాప్‌లు వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది.
కెమెరా ఫీచర్లు
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఈ మొబైల్లో 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 మెయిన్ రేర్ కెమెరాను అందించారు. దానికి లైట్ సెన్సర్‌ను యాడ్ చేశారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 13మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. AI Cam, Portrait Mode, Super Night Mode, Timelapes, Vlog Mode, Slo motion వంటి ఫీచర్లు ఈ కెమెరాలు సపోర్ట్ చేయనున్నాయి.
బ్యాటరీ మెయిన్ హైలైట్
ఇక ఈ Pova 8 స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీనే మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. 8000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్కు మద్దతు ఉండటంతో తక్కువ సమయంలోనే ఫుల్ చార్జి చేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి చార్జి చస్తే 39 గంటలపైగా కాలింగ్, దాదాపు 18 గంటల వీడియో ప్లే బ్యాక్, 1100 గంటలకు పైగా స్టాండ్ బై సమయం అందుతుందని టెక్నో కంపెనీ పేర్కొంది.
అదనంగా ఈ మొబైల్లో IP 64 డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో పాటు MIL-STD-810H మిలటరీ గ్రేడ్ ధృవీకరణ కూడా లభించింది. ఇక గేమింగ్ సమయంలో వేడిని కంట్రోల్ చేసేందుకు 14,869 చదరపు మిల్లీమీటర్ల కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

