ఖైరతాబాద్ : ఇవాళ ఉదయం నగరంలోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఖైరతాబాద్ జోన్ అడిషనల్ డీసీసీ ఆనంద్ రంగంలోకి దిగారు. కాల్పులు జరిపి రూ.6 లక్షలు చోరీ చేసిన అనంతరం దుండగులు మోతీనగర్ రైల్వేస్టేషన్లో దుస్తులు మార్చుకున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలుస్తోంది.
కాగా ఇవాళ ఉదయం ఏడు గంటలకు కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న రషీద్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అతడి నుంచి రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో రషీద్ కాలుకు గాయంకాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.