కారేపల్లి , అక్టోబర్ 29 : తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో గల అంజనాజపురం నిమ్మవాగు బ్రిడ్జి పై నుండి నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాగా, పల్లిపాడు -ఏన్కూర్ మార్గ మధ్యలో ఉన్న బ్రిడ్జిపై పొంగిపొర్లుతున్న నీటి ప్రవాహం నుంచి డ్రైవర్ డీసీఎం వ్యాను దాటించే ప్రయత్నం చేశాడు.
అయితే బ్రిడ్జి మధ్యలోకి రాగానే వాహనం ఆగిపోవడంతో స్థానికులు డీసీఎంను వదిలి ఒడ్డుకు రావాలని ఎంత చెప్పిన వినలేదు. దీంతో డీసీఎం నీటి ప్రవాహంలో కొట్టుకు పోయింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ నీటిలో గల్లంతు అయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.