ధర్మారం, ఏప్రిల్ 21: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) లో 5వ తరగతి చదువుతున్న దయ్యాల మనీంద్ర పీపుల్స్ నెస్ట్ టాలెంట్ టెస్ట్-2026 కు పెద్దపెల్లి జిల్లా నుండి ఎంపికయ్యాడు. హైదరాబాద్ లోని ప్రగతినగర్ లో ప్రముఖ విద్యావేత్త ఐఐటి చుక్కా రామయ్య సలహాలతో నిర్వహించబడే పీపుల్స్ నెస్ట్ స్కూలులో 6వ తరగతిలో సీటు సాధించాడు.
ఆ పాఠశాల హెడ్మాస్టర్ జాడి శ్రీనివాస్ ప్రోత్సాహంతో పాఠశాల సహా ఉపాధ్యాయుడు కాట నరసయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పీపుల్స్ నెస్ట్ టాలెంట్ టెస్ట్ కొరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్ష రాయించారు. మునీంద్ర భవిష్యత్తులో విద్యలో ఉన్నత స్థానాలకు ఎదగాలని పాఠశాల సిబ్బంది ఆకాంక్షించారు. అదేవిధంగా పాఠశాల నుంచి ఎన్ .వైష్ణవి, జే వర్షినిప్రియ, ఎల్ తన్విష్ అనే ముగ్గురు విద్యార్థులకు గురుకుల సీట్లు సాధించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.