దుబాయ్: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కించుకున్నాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా తొలిసారి టైటిల్ దక్కించుకోవడంలో వార్నర్ కీలకంగా వ్యవహరించాడు. ఏడు మ్యాచ్ల్లో మూడు అర్ధసెంచరీలతో 289 పరుగులు చేసిన వార్నర్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ గా నిలిచాడు. ముఖ్యంగా నాలుగు ఇన్నింగ్స్లో ఈ డాషింగ్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.