మాదాపూర్, సెప్టెంబర్ 22 : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా 2025తో నగర వాసులకు పండగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొచ్చింది. ఓ వైపు దసరా ప్రత్యేక ఆఫర్లతోపాటు మరో వైపు నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డేతో లక్కీ డ్రా బంపర్ ఆఫర్లతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండాపూర్‌లోని హర్ష టోయోటాలో సోమవారం రెండవ, మూడవ లక్కీ డ్రాలను హర్ష టోయాటా సేల్స్ సీఈఓ ప్రశాంత్ పాములపర్తి, సర్వీస్ సీఈఓ నవీన్ సమక్షంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే మార్కెటింగ్ విభాగం జీఎం సురేందర్‌రావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి, డిప్యూటీ మేనేజర్ సందీప్ జోషిలతో కలిసి లక్కీ డ్రాను తీశారు.
ఈ నేపథ్యంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే జీఎం ఎన్ సురేందర్ రావు మాట్లాడుతూ … గత 10 ఏండ్లుగా కొండాపూర్‌లోని హర్ష టోయాటాతో లక్కీ డ్రా బంపర్ డ్రా తీస్తూ అటు నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే పాఠకులకు, ఇటు వినియోగదారులకు మరింత చేరువ కావడం సంతోషంగా ఉందన్నారు. రెండో లక్కీ డ్రాలో నలుగురు విజేతలు, మూడో లక్కీ డ్రాలో నలుగురు విజేతలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు నగరంలోని పలు చోట్ల లక్కీ డ్రాలు కొనసాగనున్నట్లు ఆయన చెప్పారు. టైటిల్ స్పాన్సర్‌గా సీఎంఆర్ షాపింగ్ మాల్, మెయిన్ స్పాన్సర్‌గా అల్లకాస్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బిగ్ సీ, పవర్డ్ బై ఆల్మోన్డ్ హౌజ్, ప్రోటీన్ పార్టనర్‌గా వెన్‌కాబ్ చికెన్, అసోసియేషన్ విత్ హర్షా టోయోటా, కున్ హుందాయ్, వరుణ్ మోటార్స్, మానెపల్లి జ్యువెల్లర్స్, శ్రీ సిల్క్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెలివిజన్ పార్టనర్‌గా టీ న్యూస్, డిజిటల్ పార్టనర్‌గా సుమన్ టీవీ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం హర్ష టోయాటా సేల్స్ సీఈఓ ప్రశాంత్ పాములపర్తి మాట్లాడుతూ … నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే వారు గత 10 సంవత్సరాలుగా దసరా పర్వదినాన వినియోగదారులకు మరింత చేరువై వారికి మరింత ఉత్సాహన్ని ఇచ్చేందుకు లక్కీ డ్రా బంపర్ ఆఫర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డేతో భాగస్వామ్యం వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే వారు లక్కీ డ్రా ద్వారా నలుగురు విజేతలను ఎంపిక చేసి మొదటి బహుమతిగా ఎల్ఈడీ టీవీ, రెండో బహుమతిగా మొబైల్ ఫోన్, మూడో బహుమతిగా గిఫ్ట్ వోచర్, నాలుగో బహుమతిగా గిఫ్ట్ హ్యంపర్ను అందిస్తున్నట్లు చెప్పారు.
సర్వీస్ సీఈఓ నవీన్ మాట్లాడుతూ … పండుగ వేళ ఇటువంటి స్కీంలను అందించడం ద్వారా వినియోగదారులకు మరింత ఉత్సాహం వస్తుందని తెలిపారు. హర్ష టోయోటాలో నిర్వహించిన రెండో లక్కీ డ్రాలో మొదటి విజేత కె.భాగ్యమ్మ కూపన్ (002478) 32 ఇంచుల టీవీ, రెండో లక్కీ డ్రా విజేత టి.సుమతి (కూపన్ 002175) స్మార్ట్ ఫొన్, మూడో విజేత నాగవంశీ (కూపన్ 011131)గిఫ్ట్ వోచర్, నాలుగో విజేత మహమ్మద్ అబుదామ్ (కూపన్ 006786) గిఫ్ట్ హ్యంపర్ను గెలుచుకున్నారు.
కాగా మూడో లక్కీ డ్రాలో మొదటి విజేత తనుజా (కూపన్ 008994) 32 ఇంచుల ఎల్ఈడీ టీటీ, రెండో బహుమతి ఆర్ఎస్ శాస్త్రి (కూపన్ 002724) స్మార్ట్ ఫోన్, మూడో బహుమతి గ్రీష్మ (కూపన్ 002370) గిఫ్ట్ వోచర్, నాలుగో బహుమతి మోహమ్మద్ అబుదాఖాన్ చర్మాస్ (కూపన్ 006937) గిఫ్ట్ హ్యాంపర్లను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ప్రతినిధి బృందంతో పాటు హర్షా టోయోటా ప్రతినిధులు, సిబ్బంది ఉన్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే సంయుక్తంగా గత పదేళ్లుగా నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజాలో ప్రతిసారి భాగస్వామ్యం తీసుకుంటుంది. ఈ పండుగ వాతావరణంలో హర్షా టోయోటా ఇచ్చే రాయితీలే కాకుండా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారు ఇచ్చే రాయితీలతో మా సేల్స్‌కు మరింత ప్రోత్సాహకంగా ఉంది. దీనివల్ల ప్రతి సంవత్సరం నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డేతో భాగస్వామ్యం వహిస్తున్నాం. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జీఎస్టీకి సంబంధించిన అడ్వాన్టేజ్తో సేల్స్ కూడా ఊపందుకున్నాయి.
– ప్రశాంత్ పాములపర్తి, సేల్స్ సీఈఓ , హర్ష టొయోటా
నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో 8 సర్వీస్ స్టేషన్లతో అత్యంత నాణ్యమైన సేవలను హర్ష టోయోటా వాహనదారులకు అందిస్తూ వారి ఆదరాభిమానాలను, విశ్వాసాన్ని చూరగొన్నది. ప్రతి ఏటా నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే బొనాంజాలో పాలు పంచుకోవడం ఎంతో సంతృప్తి దాయకం.
– నవీన్, సర్వీస్ సీఈఓ, హర్ష టొయోటా