పార్కులో ప్రమాదకరంగా ఆటపరికరాలు
- నిర్వహించాలని స్థానికుల వేడుకోలు
కాప్రా, ఏప్రిల్ 8 : సైనిక్‌పురిలోని జీహెచ్ఎంసీ పార్క్ ఆహ్లాదానికి కేరాఫ్‌గా నిలుస్తున్నది. అయితే చిల్డ్రన్స్‌పార్కులో ఏర్పాటు చేసిన ఆటవస్తువులు, నిచ్చెనలు, జారుడు బల్లలు మాత్రం శిథిలావస్థకు చేరాయి. జారుడు బల్లపై నుంచి జారుతూ, ఊయలలు ఊగుతూ కేరింతలు కొట్టే చిన్నారుల సందడి సందర్శకులకు కనువిందు చేస్తుంది. అయితే ఈ ఆటపరికరాలు ఇటీవల బాగా దెబ్బతినడం చిన్నారులను, వారి తల్లిదండ్రులను ఆవేదనకు గురి చేస్తోంది.
దెబ్బతిన్న ఆటపరికరాలతో చిన్నారులు ఇబ్బందులు..
సైనిక్‌పురి జీహెచ్ఎంసీ పార్కులో చిల్డ్రన్స్ ప్లేజోన్ లోని ఆటపరికరాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉత్సాహంగా జారుడు బల్ల ఎక్కి జారుతూ సంతోషాన్ని పొందే వారికి జారుడు బల్లకు దిగువన ఏర్పడిన వెడల్పాటి రంధ్రం వల్ల వారు కిందకు దిగాల్సింది పోయి రంధ్రంలోకి జారిపోయి మట్టిలోపడిపోతున్నారు. దీంతో వారు గాయాల పాలవుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మతులు చేయాలి..
సైనిక్‌పురి చిల్డ్రన్స్‌పార్కులో చిన్నారులకు ఎంతో సంతాషా న్ని ఇచ్చే జారుడు బల్లతో పాటు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. దీంతో వారు కిందపడి దెబ్బలు తలిగించుకొంటున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టాలి.
-సంజీవరెడ్డి, కాప్రాకాలనీల అధ్యక్షుడు
ప్రతిపాదనలు పంపాం
సైనిక్పురిపార్కులో చిల్డ్రన్స్ జోన్లో దెబ్బతిన్న ఆటపరికరాలు, జారుడు బల్లల మరమ్మతులకు, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయడం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాం. మంజూరైన వెంటనే వాటికి మరమ్మతు పనులు చేపడతాం.
– ఏ. నర్సింరావు, మేనేజర్, హార్టికల్చర్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- GHMC Park
- hyderbad news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

