హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) సీనియర్ ఫ్యాకల్టీ రూపొందించిన హెల్తిట్యూడ్ 2.0 రిన్యూ, రిచార్జ్, రివైవ్ పోస్టర్ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీన్, సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభోద్ కందముత్తన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ రేష్మ ఎం గోపన్ పాల్గొన్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం రహదారిలో మంగళవారం అడవి దున్నలు సంచరించాయి. ఉదయం సమ్మక్క, సారలమ్మల దర్శనానికి వెళ్తున్న భక్తులకు మేడారం సమీపంలోని శివరాంసాగర్ చెరువు సమీపంలోకి రాగానే మూడు దున్నలు రోడ్డు దాటుతూ కనిపించగా ఫొటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోయారు.
-తాడ్వాయి