నిజామాబాదు జనవరి : ఎస్సీలు(SCs) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో(Municipal elections) బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని డాక్టర్ పులి జైపాల్, మల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు. ఎస్సీ డివిజన్లపై హైకోర్టు లో బీజేపీ వేసిన పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ప్రెస్ క్లబ్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ చౌరస్తాలో బీజేపీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేవలం ఎస్సీ డివిజన్లు 39, 40, 44 లలో రిజర్వేషన్లను సవాలు చేస్తూ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేయడంతో ఎస్సీల పట్ల బీజేపీ వైఖరి మరో మారు బయటపడిందని విమర్శించారు. 60 డివిజన్లలో రిజర్వేషన్లపై పిటిషన్ వేయాల్సిన వారు, వారి రాజకీయ లబ్ధి కోసం కేవలం ఎస్సీ డివిజన్ల పై వేసి ఎస్సీలను రాజకీయ బలి పశువులుగా చేస్తున్నారని మండిపడ్డారు.
ఎస్సీల జోలికి వస్తే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బీజేపీ ఓడించేందుకు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ వైఖరికి నిరసనగా రాబోయే కాలంలో మరిన్ని ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బంగారు సాయిలు, షేక్ హుస్సేన్ , టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లని శివ, మహిళా నాయకులు బంటు జ్యోతి, మాల మహానాడు నాయకులు వినయ్, దండు చంద్రశేఖర్, నీలగిరి రాజు, చందు, చంద్రకాంత్, రాజయ్య, అశోక్ భాగ్యవాన్, దయానంద్, భీమ్ ఆర్మీ అధ్యక్షులు అజయ్, జమాతే ఇస్లామీ హింద్ నాయకులు హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

