Pawan Kalyan |మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో నడుస్తుండగా, మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న రియాక్షన్లపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై ఏమన్నారన్నది మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అంశం. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాత సుస్మిత కొణిదెల ఓ తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ స్పందనపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ పనులతో బిజీగా ఉన్నారని, అందుకే ఇంకా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూడలేదని ఆమె స్పష్టం చేశారు.
అయితే సినిమా చూడకపోయినా, బాక్సాఫీస్ రిజల్ట్ గురించి మాత్రం ఆయనకు రెగ్యులర్ అప్డేట్స్ వెళ్తున్నాయని తెలిపారు. సినిమాకు వస్తున్న సూపర్ రెస్పాన్స్ చూసి పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారట. వ్యక్తిగతంగా సుస్మితకు మెసేజ్ చేసి “సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది.. ఆల్ ది బెస్ట్” అంటూ అభినందనలు తెలిపినట్లు ఆమె చెప్పారు. బిజీ షెడ్యూల్ కారణంగా ప్రస్తుతం టైమ్ కుదరడం లేదని, కానీ మనసు కొంచెం ఫ్రీ అయిన వెంటనే తప్పకుండా సినిమా చూస్తానని పవన్ మాటిచ్చినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ లాంటి బిజీ రాజకీయ నాయకుడి నుంచి ఇలాంటి పాజిటివ్ మెసేజ్ రావడం ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీమ్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని సుస్మిత పేర్కొన్నారు. ఒక నిర్మాతగా తాను చేస్తున్న ప్రయత్నాలను బాబాయ్ ఎప్పుడూ గౌరవిస్తారని, ఈ సినిమా విషయంలోనూ అదే సపోర్ట్ కనిపించిందని ఆమె తెలిపారు.
మెగా ఫ్యామిలీలో అందరూ పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా చూస్తారో అని ఎదురుచూస్తున్నారని నవ్వుతూ చెప్పారు. ఇక వింటేజ్ చిరంజీవిని మళ్లీ వెండి తెరపై చూడటం పవన్ కళ్యాణ్‌కు పర్సనల్‌గా ఎంతో ఇష్టమైన విషయం కావడంతో, ఆయన స్పెషల్ స్క్రీనింగ్‌లో సినిమా చూసిన తర్వాత ఇచ్చే ఫీడ్‌బ్యాక్ టీమ్‌కు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అవుతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. అన్నయ్య సినిమా సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వ్యక్తిగతంగా సెలబ్రేట్ చేస్తారని తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సమ్మర్లో రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమా అప్డేట్స్తో పవర్ స్టార్ పేరు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.