Daksha Nagarkar | టాలీవుడ్ హీరోయిన్ ‘హుషారు’, ‘జాంబిరెడ్డి’ సినిమాల ఫేమ్ దక్ష నగార్కర్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. తనకు ఏమైంది అనే విషయాన్ని బయటపెట్టకుండా ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది ఈ భామ.
గత కొన్ని రోజులుగా స్ట్రెచర్‌పై నాకు తెలియని వ్యక్తులతో సర్జరీ గదిలో ఉండటం చాలా కష్టంగా ఉంది. నాకు రెండు సార్లు వెన్నెముకపై అనస్థీషియా ఇచ్చారు. దాని నుంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను నా భావోద్వేగాలన్నింటినీ కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు సపోర్ట్ గా నిలిచారు. కష్ట సమయంలో మనిషిని ఎలా ప్రేమించాలో చూపించారు. ప్రేమకు నిజంగా కనిపించని గాయాలను నయం చేసే శక్తి ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. దయచేసి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను సంతోషకరమైన విషయాలనే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరూ బాధపడకూడదు కాబట్టి అని తెలిపింది.