NBK | నందమూరి బాలకృష్ణ మళ్లీ యాక్షన్‌లోకి దిగారు. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారని సమాచారం. ఇంకా టైటిల్ ఖరారుగాని ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తున్నది. ఇందులో శ్రియారెడ్డి ప్రతినాయకురాలిగా నటిస్తున్నదట.
ఈ షెడ్యూల్లోనే బాలయ్య, శ్రియారెడ్డిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ప్రతినాయికగా నటించడంలో శ్రియారెడ్డి దిట్ట. అప్పటి ‘పొగరు’, మొన్నటి ‘సలార్’ చిత్రాలే అందుకు నిదర్శనాలు. ‘సలార్’లో ‘రాధారమా మన్నార్’గా పవర్ఫుల్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలందుకున్నది శ్రియారెడ్డి, ప్రస్తుతం చేస్తున్న బాలయ్య సినిమాలో కూడా ఆమె పాత్ర ఆ స్థాయిలోనే ఉంటుందని తెలుస్తున్నది.
ఇన్నాళ్లూ పవర్ఫుల్ విలన్లతో ఢీకొట్టిన బాలయ్య, తొలిసారి లేడీ విలన్‌తో తలతలపడనున్నారన్న వార్త వినగానే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రెట్టింపయ్యింది. సినిమా విడుదల తేదీని అతిత్వరలోనే నిర్మాతలు ప్రకటించనున్నారట. అటు హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వస్తున్న బాలకృష్ణ సినిమా, ఇటు బ్లాక్బాస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వస్తున్న బాబీ సినిమా.. ఇదే కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.