ముంచుకొస్తున్న ‘మురసు’
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్రరూపం దాల్చి ‘మురసు’ తుఫాన్‌గా దూసుకొస్తున్నది. ఇది వేగంగా ఏపీ తీరం వైపు దూసుకొస్తుండటంతో దక్షిణ కోస్తాం ధ్ర, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. రాబోయే 24గంటల్లో మరింత బలపడి సోమవారం ఉదయం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నది.
- నేడు తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం
- నెల్లూరు-నర్సాపూర్ మధ్య తీరం దాటే చాన్స్
- తెలంగాణలోనూ వర్షాలు
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్రరూపం దాల్చి ‘మురసు’ తుఫాన్‌గా దూసుకొస్తున్నది. ఇది వేగంగా ఏపీ తీరం వైపు దూసుకొస్తుండటంతో దక్షిణ కోస్తాం ధ్ర, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. రాబోయే 24గంటల్లో మరింత బలపడి సోమవారం ఉదయం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నది. అనంతరం వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం రాత్రి 11.30 నుంచి తెల్లవారుజాము 4గంటల సమయంలో నెల్లూరు-నర్సాపూర్ మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నది. తీరం దాటే సమయానికి గంటకు 100 కి.మీ, గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో భీకరంగా గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఇటు తెలంగాణలో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశమున్నది.
కీసరలో 9.68 సెం.మీ వర్షపాతం
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు కురువగా, అత్యధికంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరలో 9.68 సెం.మీ, ములుగు జిల్లా తాడ్వాయిలో 9.02 సెం.మీ, యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లిలో 7.60 సెం.మీ, రామన్నపేటలో 6.83 సెం.మీ, బీబీనగర్‌లో 6.61 సెం.మీ, వలిగొండలో 6.52 సెం.మీ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 7.57 సెం.మీ, నల్లగొండ జిల్లా చిట్యాలలో 7.08 సెం.మీ, నార్కట్‌పల్లిలో 7.0 సెం.మీ, హైదరాబాద్ జిల్లా బహదూర్‌పూర్‌లో 5.99 సెం.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోల్చితే 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 36.9 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

