Cyclone Murasu | ముంచుకొస్తున్న ‘మురసు’.. నేడు తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం
Cyclone Murasu | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్రరూపం దాల్చి ‘మురసు’ తుఫాన్‌గా దూసుకొస్తున్నది. ఇది వేగంగా ఏపీ తీరం వైపు దూసుకొస్తుండటంతో దక్షిణ కోస్తాం ధ్ర, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది.
Cyclone Murasu | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్రరూపం దాల్చి ‘మురసు’ తుఫాన్‌గా దూసుకొస్తున్నది. ఇది వేగంగా ఏపీ తీరం వైపు దూసుకొస్తుండటంతో దక్షిణ కోస్తాం ధ్ర, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది.
రాబోయే 24గంటల్లో మరింత బలపడి సోమవారం ఉదయం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నది. అనంతరం వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం రాత్రి 11.30 నుంచి తెల్లవారుజాము 4గంటల సమయంలో నెల్లూరు-నర్సాపూర్ మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నది. తీరం దాటే సమయానికి గంటకు 100 కి.మీ, గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో భీకరంగా గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఇటు తెలంగాణలో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశమున్నది.
కీసరలో 9.68 సెం.మీ వర్షపాతం
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు కురువగా, అత్యధికంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరలో 9.68 సెం.మీ, ములుగు జిల్లా తాడ్వాయిలో 9.02 సెం.మీ, యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లిలో 7.60 సెం.మీ, రామన్నపేటలో 6.83 సెం.మీ, బీబీనగర్‌లో 6.61 సెం.మీ, వలిగొండలో 6.52 సెం.మీ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 7.57 సెం.మీ, నల్లగొండ జిల్లా చిట్యాలలో 7.08 సెం.మీ, నార్కట్‌పల్లిలో 7.0 సెం.మీ, హైదరాబాద్ జిల్లా బహదూర్‌పూర్‌లో 5.99 సెం.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోల్చితే 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 36.9 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
Senco Jewellers | బీహార్‌లో రూ.40 కోట్ల బంగారం చోరీ.. సెంకో జ్యువెలర్స్ షోరూంలో భారీ దోపిడీ
Artificial Intelligence | ఏఐతో శాశ్వత నిరుద్యోగం.. ఎవరికీ ఉద్యోగాలు ఉండవు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడాల్సి రావొచ్చు
Kerala High Court | రికార్డుల్లో దత్తత పదం తొలగించాలి
Baljinder Singh | రైతును వరించిన రూ.12 కోట్ల లాటరీ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

