వాణిజ్య సిలిండర్‌పై రూ.10 పెంపు.. వరుసగా మూడో నెల వడ్డింపు
దీపావళి ముంగిన కేంద్రం ప్రజలపై మరో పిడుగు వేసింది. ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధర మరోసారి పెంచింది. నవంబర్ 1 నుంచి 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.10 పెంచడంతో దాని ధర రూ.2,820కు చేరుకుంది.
- దీపావళి ముంగిట కేంద్రం వాత
న్యూఢిల్లీ, నవంబర్ 1 : దీపావళి ముంగిన కేంద్రం ప్రజలపై మరో పిడుగు వేసింది. ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధర మరోసారి పెంచింది. నవంబర్ 1 నుంచి 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.10 పెంచడంతో దాని ధర రూ.2,820కు చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం వరుసగా మూడో నెల కూడా పెంచింది. అలాగే విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర కూడా లీటర్‌కు రూ.1.37 పెరిగినట్టు చమురు కంపెనీలు తెలిపాయి.
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు జూలై, ఆగస్టులలో తగ్గగా, సెప్టెంబర్‌లో రూ.9.50, అక్టోబర్‌లో రూ.62.50, ఇప్పుడు రూ.10 పెరిగింది. ఫిబ్రవరి, జూన్‌ల మధ్య దీని ధర ఏకంగా రూ.1,373 పెరిగింది. దీంతో అప్పటివరకు రూ.1,740 ఉన్న సిలిండర్ ధర అమాంతం 3,113.50కు చేరుకుంది. తర్వాత జూలై, ఆగస్టులలో వీటి ధర కొద్దిగా తగ్గింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

