రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం
నగరానికి నీటిని సరఫరా చేసే గండిపేట కాండ్యూట్లో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల్లో ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టనుంది.
సిటీ బ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): నగరానికి నీటిని సరఫరా చేసే గండిపేట కాండ్యూట్లో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల్లో ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టనుంది. ఈ పనులు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు చేపడుతారు. ఈ పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు.
రెడ్ హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్ నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్ ఫౌండ్రీ, చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్ నగర్, అహ్మద్ నగర్, కవాడిగూడ, గాంధీనగర్ వార్డుల పరిధిలోని దోమలగూడ, బంజారాహిల్స్ వార్డు పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు వెల్లడించారు. అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

