చావు!
కనిపించదు కానీ కలిసి మన వెంటే నడుస్తుందంటారు మనపై బరువు మోపినట్లుండదు!
కనిపించదు కానీ
కలిసి మన వెంటే నడుస్తుందంటారు
మనపై బరువు మోపినట్లుండదు!
రాలిపోయే కాలం కోసం
ఋతువులా ఎదురుచూస్తుందే కానీ
ఎవరు రమ్మన్నా ముందస్తుగా రాదది!
ఇంకొన్ని రోజులు
పోయే కాలం వస్తే పొమ్మన్నా పోదు!
ఇదీ నీ చివరి తేదీ అని చెప్పదు
మనమే రోజులు లెక్కిస్తుంటాం
కాలం తీరిందా ఏం చేసినా లాభం లేదు!
మన రాకపోకల మధ్య
చావొక అదృశ్య సూచిక
బతికినన్నాళ్లూ బంగారమై మెరిసిపోవాలి!
తదనంతర కాలంలో
మనం తిరుగాడిన చోట్లలో
మన ఆనవాళ్లే వెలుతురు దీపాలవ్వాలి!
గాంధీ, అంబేద్కర్
మన మధ్య లేక ఎన్నేళ్లయింది?
అయినా కదిలే సమూహాల్లో వాళ్ల కదలిక!
జీవితాన్ని ప్రేమించిన వాళ్లంతా
ఒక మానవీయ లోకాన్ని కలగన్నారు
వాళ్లు చావును ఎన్నడూ గెలవనీయరు!
అతిథిలా వచ్చిన వాళ్లమే కావచ్చు
పోతూ పోతూ మన మీలోకాన్ని
కృతజ్ఞతగా మరింత కాంతివంతం చేయాలి!
అదే విధానం
మహనీయులు చావుకు
మరణ శాసనం రాసిన పద్ధతి!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

