హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరాల బారినపడిన బాధితులకు రికవరీ చేసిన రూ.42.22 కోట్ల నగదు అందజేసినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. జాతీయ లోక్అదాలత్లో మొత్తం 1,05,182 కేసులు పరిషారమైనట్టు శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ తెలిపారు.
అత్యధికంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 23,671 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14,771 కేసులు, నల్లగొండ జిల్లాలో 7,886 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6,936 కేసులు పరిషారమైనట్టు ఒక ప్రకటనలో పేరొన్నారు.