న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: వారణాసి ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.45 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరూ యూఏఈ నుంచే వచ్చారు. ఇద్దరిలో ఓ వ్యక్తి బంగారాన్ని కరిగించి విగ్గులో దాచుకొని స్మగ్లింగ్ చేసినట్టు అధికారులు తెలిపారు.