పనాజీ: ఉత్తర గోవాలోని అంజునా ప్రాంతంలో ఉన్న కర్లీస్ రెస్టారెంట్‌ను అధికారులు కూల్చివేశారు. హర్యానా బీజేపీ నేత సోనాలీ పోగట్ మృతితో ఆ రెస్టారెంట్‌కు లింకు ఉంది. అయితే కోస్టల్ రూల్స్‌ను ఉల్లంఘించిన నేపథ్యంలో రెస్టారెంట్‌ను కూల్చివేస్తున్నట్లు గోవా అధికారులు వెల్లడించారు. గోవాలోని ఫేమస్ అంజునా బీచ్ వద్ద కర్లీస్ రెస్టారెంట్ ఉంది. ఇటీవల మృతిచెందిన సోనాలీ పోగట్ కేసులో ఆ రెస్టారెంట్ ఓనర్ ఎడ్విన్ నూనెస్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 7.30 నిమిషాలకే కర్లీస్ రెస్టారెంట్ కూల్చివేతను ప్రారంభించారు. సీఆర్‌జెడ్ నియమావళికి వ్యతిరేకంగా నో డెవలప్మెంట్ జోన్లో కర్లీస్ రెస్టారెంట్‌ను కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్జీటీ కోర్టు నుంచి ఆ రెస్టారెంట్ ఓనర్ ఎటువంటి మినహాయింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే కర్లీస్ రెస్టారెంట్ కూల్చివేతను ఆపాలని ఇవాళ సుప్రీంకోర్టు స్టే మంజూరీ చేసింది. కమర్షియల్ ఆపరేషన్స్‌ను నిలిపివేయాలని ఆ రెస్టారెంట్‌ను సుప్రీంకోర్టు కోరింది.