షాద్నగర్, ఏప్రిల్ 1: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పనితీరును మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ట్రిపుల్ ఆర్ పేరుతో షాద్నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన నర్సరీలో ఖాళీ కొబ్బరి బొం డాల్లో మొక్కలను పెంచుతున్నారు. కుళ్లిపోయిన బొం డాలతో సేంద్రియ ఎరువును, నారతో ఉన్న బొండాలతో కొబ్బరి నార తాళ్లను తయారుచేస్తున్నారు. ఈ ప్రక్రియను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా మెచ్చుకొన్నారు.