చెన్నై: రాబోయే ఐపీఎల్ 2021 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై తమ జెర్సీలో పలు కీలక మార్పులు చేయడం ఇదే మొదటిసారి. భుజాలపై ఆర్మీ దుస్తుల్లోని రంగుతో స్ట్రాప్లను జతచేశారు. భారత సాయుధ దళాలకు నివాళిగా చెన్నై ఈ నిర్ణయం తీసుకున్నది. భారత సైన్యంలో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. కొత్త జెర్సీలను ధోనీ బుధవారం ఆవిష్కరించారు. ప్రస్తుతం చెన్నైలో ప్రాక్టీస్ క్యాంప్‌లో సాధన చేస్తున్న ధోనీసేన త్వరలో ముంబైకి వెళ్లనుంది. ముంబై వేదికగా చెన్నై ఐదు మ్యాచ్‌ల్లో తలపడనుంది.
Thala Dharisanam! #WearOnWhistleOn with the all new #Yellove! #WhistlePodu 💛🦁
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 24, 2021
🛒 – https://t.co/qS3ZqqhgGe pic.twitter.com/Gpyu27aZfL