న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్బీఆర్ఐ)లో వివిధ పోస్టుల భర్తీకి CSIR నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 30 వరకు అందుబాటులో ఉంటాయిని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఎంపికైనవారు లక్నోలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 10
ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) 5, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్ డిపార్ట్మెంట్లో 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. నిర్ణీత వేగంతో టైపింగ్ చేయాలి. అభ్యర్థులు 2021, సెప్టెంబర్ 30 నాటికి 28 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ముందుగా అభ్యర్థులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో వచ్చిన మార్కులను బట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ఆన్లైన్లో దరఖాస్తును ప్రింట్‌తీసి కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఎన్బీఆర్ఐ, రాణా ప్రతాప్ మార్గ్, లక్నో–226001 అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 100
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 30
వెబ్సైట్: www.nbri.res.in