కేశంపేట, జూన్ 6 : కేశంపేట పోలీస్ స్టేషన్‌ను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి శుక్రవారం సాయంత్రం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి పలు సూచలనలు, సలహాలను అందజేశారు. నేరాలకు సంబంధించిన ఫైల్స్‌ను పోలీస్ స్టేషన్లో పెండింగ్‌లో పెట్టుకోవద్దని, సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేసి కోర్టుకు అందజేయాలన్నారు.
శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీకి తావులేకుండా కృషి చేయాలని, మండలంలో ఎలాంటి ఘటనలు జరిగినా వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలన్నారు. అంతకుముందు సీపీతోపాటు ఉన్నతాధికారులకు ఎస్ఐ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ రాజేశ్, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, షాద్‌నగర్ ఏసీపీ లక్షీనారాయణ, ఎస్ఐ రాజ్‌కుమార్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.