కరోనా బాధితురాలిపై లైంగిక దాడి.. మృతి
కరోనా బాధితురాలిపై లైంగిక దాడి.. మృతి | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితురాలిపై ఓ నర్స్ (మేల్) లైంగిక దాడికి పాల్పడగా.. చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితురాలిపై ఓ నర్స్ (మేల్) లైంగిక దాడికి పాల్పడగా.. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటన గత నెల 6న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేరిన ఓ మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని 43 మహిళ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వెంటనే ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌కు తరలించారు. అదే రోజు సాయంత్రం చికిత్స పొందుతూ కన్నుమూసింది.
ఘటనపై నిషాత్పురా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయగా.. నిందితుడు సంతోష్ అహివార్ (40)గా గుర్తించారు. అరెస్టు చేసి భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి ఇర్షాద్ వలీ మాట్లాడుతూ బాధితురాలు పోలీసులకు దరఖాస్తు ఇచ్చిందని, అయితే తన గుర్తింపును కాపాడాలని.. ఘటన గురించి ఎవరికీ తెలియనివ్వొద్దని కోరిందని పేర్కొన్నారు. దీంతో దర్యాప్తు బృందం తప్ప ఎవరితోనూ సమాచారం పంచుకోలేదన్నారు. నిందితుడు 43 ఏళ్ల స్టాఫ్ నర్సుపై సైతం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, గతంలో ఉద్యోగంలో ఉన్న సమయంలో మద్యం సేవించినందుకు సస్పెండ్ చేశారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
అయితే, బాధిత మహిళ 1984 భోపాల్ గ్యాస్ విషాదంలో ప్రాణాలతో బయటపడినందున, విపత్తు బాధితుల సంఘం భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ (బీఎంహెచ్‌ఆర్‌సీ)లో కొవిడ్ రోగుల దయనీయ పరిస్థితులను తెలుపుతూ అధికారులకు లేఖ రాశారు. ‘ఘోరమైన, నేరపూరిత చర్యను కప్పిపుచ్చేందుకు దవాఖాన యాజమాన్యం ప్రయత్నించిందని ఆరోపించారు. బాధితురాలి మరణంపై దర్యాప్తు కోసం ఫిర్యాదు చేయకపోవడం, అన్ని కొవిడ్ వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, లైంగిక దాడుల్లో నేరస్థులను ఆసుపత్రుల్లో నియమించుకోకుండా చూసుకోవడంలో ‘వైఫల్యం’ చెందిందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
జపాన్‌లో భారీ భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి
ముమ్మరంగా వ్యాక్సినేషన్.. 18కోట్లకు చేరువలో..
కరోనా సోకిందని ఇద్దరి ఆత్మహత్య
దేశంలో కొత్తగా 3.43లక్షల కేసులు.. 4వేల మరణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

