ఐదు వేల ఏండ్ల క్రితమే ప్రపంచానికి వణికించిన మహమ్మారి.. వెలుగులోకి సంచలన నిజాలు
వాస్తవానికి 14వ శతాబ్దంలో వచ్చిన ప్లేగు వ్యాధి గురించి మాత్రమే మనకు తెలుసు. అప్పట్లో ఈ వ్యాధి కారణంగా యూరప్‌లో సగం మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనావైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలను ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. దాదాపు ఐదు వేల ఏండ్ల క్రితం కూడా ఈ తరహాలోనే ఒక వ్యాధి యూరప్ ఖండాన్ని వణికించింది. దీనివల్ల అప్పట్లో పశ్చిమ యూరప్‌లోని చాలా జాతులు అంతరించిపోయినట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు సెల్ రిపోర్ట్స్ జర్నల్‌లో పరిశోధనా వివరాలు ప్రచురితమయ్యాయి.

యూరప్‌లోని లాట్వియాలో దొరికిన నాలుగు అస్థిపంజరాలను జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ కియెల్ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో ఒక అస్థి పంజరానికి ఆర్వీ 2039 అని నామకరణం చేశారు. ఆ అస్థిపంజరం ఒక వేటగాడిది అని.. అతని వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. ఆ అస్థిపంజరంలోని ఎముకలు, పళ్ల నుంచి సేకరించిన డీఎన్ఏను పరిశీలించగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. యెర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చే ప్లేగు వ్యాధితో అతను మరణించినట్లు పరిశోధకులు నిర్ధరించారు. ఆర్వీ 2039ను ఒక ఎలుక కరిచి ఉంటుందని.. అప్పుడే అతనికి యెర్సియా పెస్టిస్ ఇన్ఫెక్ట్ అయి.. కొద్దిరోజులకే మరణించి ఉంటాడని పరిశోధకులు భావిస్తున్నారు. మిగిలిన మూడు అస్థిపంజరాల డీఎన్ఏలోనూ ఇలాంటి ప్లేగు స్ట్రెయిన్నే కనుగొన్నట్లు తెలిపారు.
వాస్తవానికి 14వ శతాబ్దంలో వచ్చిన ప్లేగు వ్యాధి గురించి మాత్రమే మనకు తెలుసు. అప్పట్లో ఈ వ్యాధి కారణంగా యూరప్‌లో సగం మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ ప్లేగు వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా దాదాపు 7 వేల ఏండ్ల క్రితం నుంచే ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మొదట్లో జంతువుల్లోనే ఈ బ్యాక్టీరియా ఉండేదని.. ఇది జంతువులను తాకినప్పుడు, ఆహారం లేదా నీటి ద్వారా మనుషుల్లోకి వ్యాప్తి చెంది ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పట్నుంచి మనుషులను రకరకాలుగా భయభ్రాంతులకు గురిచేసిన ఈ ప్లేగు.. ఇప్పుడు మనకు తెలిసిన బ్యుబోనిక్ ప్లేగుగా రూపాంతరం చెందిందని వారు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Monsoon Diet : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

