కరోనా ఎఫెక్ట్ : జమ్మూకశ్మీర్‌లో పాఠశాలల మూసివేత
జమ్మూకశ్మీర్‌లో పాఠశాలల మూసివేత | జమ్మూకశ్మీర్‌లో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో రెండు వారాలపాటు 9వ తరగతి వరకు అన్నీ పాఠశాలలను మూసివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించింది.
ఇందులో భాగంగా రెండు వారాలపాటు కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 9వ తరగతి వరకు అన్నీ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.
దీంతో రేపటి నుంచి ఈ నెల 18 వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. 10 నుంచి 12 తరగతి వరకు విద్యార్థులకు సైతం వారంపాటు ప్రత్యక్ష తరగతులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
కేంద్ర పాలిత ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతుండటం.. చాలామంది యుక్త వయసు విద్యార్థులు వైరస్ బారినపడుతుండటంతో పాలనా యంత్రాంగం ఈ నిర్ణయించింది.
సామాజిక, ఆచార వ్యవహారాలకు సంబంధించిన వేడుకలపైనా అధికారులు ఆంక్షలు విధించారు. భౌతికదూరం పాటిస్తూ 200 మందికి మించకుండా నిర్వహించుకోవాలని సూచించారు.
కొన్నివారాలుగా జమ్మూకశ్మీర్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్ బారినపడటంతో కొన్నివారాల క్రితమే చాలా పాఠశాలలు మూతపడ్డాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

