హైదరాబాద్, జనవరి14 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తలనీలాల సేకరణ టెండరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. టెండర్ ప్రక్రియను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. తలనీలాలకు చెందిన టెండర్‌ను సవాల్ చేస్తూ దురై ఎంటర్‌ప్రైజస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి బెంచ్ గతంలో కొట్టేయగా, సవాల్ చేస్తూ దాఖలైన అప్పిల్ పిటిషన్‌ను జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కూడా డిస్మిస్ చేసింది.
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపునకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై గురువారం రోజున నిర్ణయం వెలువరించనున్నట్టు తెలంగాణ స్పీకర్ కార్యాలయం బుధవారం వెల్లడించింది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై గెలుపొందిన ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, జగదీశ్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.