‘థియేటర్లో జనం మధ్య కూర్చొని ఈ సినిమా చూశాను. ఆద్యంతం నవ్వుతూనే ఉన్నారు. ైక్లెమాక్స్‌లో ఎమోషన్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఆడియన్స్ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా చూడని వారుంటే చూసేయండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.’ అని హీరో నవీన్ పొలిశెట్టి నమ్మకం వెలిబుచ్చారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకుడు.
సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ ప్రెస్మీట్లో నవీన్ పొలిశెట్టి మాట్లాడారు. తాను పోషించిన చారులత పాత్రకు మంచి స్పందన వస్తున్నదని, పండుగ సందర్భంగా వచ్చిన ఈ సినిమా విజయం సాధించడం ఆనందంగా ఉందని కథానాయిక మీనాక్షి చౌదరి అన్నారు. అన్ని చోట్ల నుంచీ అద్భుతమైన స్పందన వస్తున్నదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆనందం వ్యక్తం చేశారు.