Suryapeta | నూతనకల్, నవంబర్ 25 : భార్యాభర్తలుగా వారు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించారు. వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా వారిద్దరూ ఒకేరోజు మృతి చెందారు. మరణంలోనూ వీడని బంధంగా ఈ సంఘటన నిలిచింది.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కొమ్ము వీరయ్య(75), కొమ్ము ఎల్లమ్మ(70) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కొడుకులు వేరుగా ఉండడంతో వంతుల వారిగా వృద్ధ తల్లిదండ్రుల ఆలనాపాలనా చూస్తున్నారు. వృద్ధ భార్యాభర్తలు వేరుగా ఒక ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు మృతి చెందారు. కొన్ని రోజులుగా వారు మంచానికే పరిమితం కాగా కుటుంబ సభ్యులు సపర్యలు చేస్తున్నారు. అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు ఒకే రోజు మృతి చెందడంతో పలువురిని కంట తడి పెట్టించింది. సోమవారం మిర్యాల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
Pensions | ఉమ్మడి పాలమూరు జిల్లాలో పింఛన్ కోసం రోడ్డెక్కిన వృద్ధులు
MLC Kavitha | కాంగ్రెస్ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసింది : ఎమ్మెల్సీ కవిత
Bakki Venkataiah | లగచర్ల ఘటనలో అమాయకులను జైల్లో పెట్టారు : బక్కి వెంకటయ్య