కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
తుఫాను ప్రభావంతో కారేపల్లి మండల వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాన ముసురు కొనసాగుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నిరంతర వర్షాల కారణంగా...
కారేపల్లి, నవంబర్ 04 : తుఫాను ప్రభావంతో కారేపల్లి మండల వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాన ముసురు కొనసాగుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నిరంతర వర్షాల కారణంగా వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడడంతో పాటు చేతికొచ్చే దశలో ఉన్న పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోవడం, పత్తి కాయలు తడిసి పంట నాణ్యత దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు చేసి సాగు చేసిన రైతులకు ఈ అకాల వర్షాలు మరింత భారంగా మారాయి.

కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
మరోవైపు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత వీధి రహదారులు బురదమయంగా మారడంతో ప్రజలు నడిచి వెళ్లేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైన చోట వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ,రెవెన్యూ శాఖల అధికారులు మండలంలోని పలు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పత్తి, వరి పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

