Corona Virus | కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. ఈ మహమ్మారి 2019 నుంచి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆసియా దేశాల్లో ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్‌లో కేసులు మళ్లీ పెరుగుతుండడం, ఇప్పుడు ఇండియాలో కూడా ఇది క్రమంగా వ్యాపిస్తుండడంతో ప్రజలు భయబ్రాంతులకి గురవుతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా దేశంలో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. దాదాపు వెయ్యికి మందికి పైగా దేశంలో కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. ఇటీవల మహేష్ బాబు మరదలు, ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటి నికితా దత్తాకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆమెతో పాటు ఆమె తల్లికి వైరస్ సోకింది. తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ స్మిత తల్లి కూడా ఈ వైరస్ బారిన పడింది.ఈ విషయాన్ని స్మిత తల్లి జోగుళాంబ తెలియజేస్తూ.. కరోనా కొత్త వేరియంట్ లక్షణాల గురించి ఇలా చెప్పుకొచ్చింది. ముచ్చటగా మూడు వ్యాక్సిన్లు తీసుకున్నా మూడవ సారి కోవిడ్ నన్ను పలకరించింది. ఈ కోవిడ్ వేరియంట్ లక్షణాల గురించి చెబుతూ.. ఒక రోజు జ్వరంతో నిద్రలేచాను, రెండవ రోజు తలనొప్పి, మూడవ రోజు గొంతు నొప్పి, నాల్గవ రోజు జలుబు, ఐదవ రోజు కడుపు నొప్పి… ఇలా రోజుకొక కొత్త లక్షణం తో ఈ వేరియంట్ “సకల కళా వల్లభన్” లా ఉంది. ఏ వేరియంట్ అయినా వెళ్ళూ వెళ్తూ విపరీతమైన బలహీనతను వదిలి వెళుతుంది,
దాని నుండి బయట పడాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే మాస్కులు బయటకు తీయండి, సురక్షితంగా ఉండండి. కేసుల్లేవు అనేది భ్రమ, ఎవరు టెస్ట్ చేయించుకోవడం లేదు అనేది వాస్తవం అంటూ స్మిత తల్లి ఎక్స్ ద్వారా తెలిపింది. ఇక వాక్సీన్ సామర్థ్యాన్ని అస్సలు తీసెయ్య లేము. వ్యాక్సిన్ శరీరం లో ఉంది కాబట్టి కోవిడ్ ఊపిరితిత్తుల దాకా వెళ్ళడం లేదు, వెళ్తే ఏం జరిగిందో గతం లో అందరూ చూసిందే అని వరుసగా ట్వీట్లు చేశారు జోగుళాంబ. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరలవుతుండగా, ఈమె కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.