లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు కరోనా సోకింది. దీంతో ఐసోలేషన్లో ఉన్న ఆమె చికిత్స పొందుతున్నారు. తేలికపాటి లక్షణాలే ఉండటంతో ఆందోళన చెందాల్సిన పనిలేదని డాక్టర్లు చెప్పారు. అయితే ఆమె వయసును (95 ఏండ్లు) దృష్టిలో ఉంచుకొని త్వరగా కోలుకొనేలా చికిత్స అందిస్తున్నామని తెలిపారు.