Midday meal | నారాయణగిరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట వివాదం
నారాయణగిరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వంట నిర్వహణపై వివాదం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న తమను ఇప్పుడు పక్కనపెట్టి, వంట చేయకుండా అడ్డుకుంటున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వంట నిర్వహణపై వివాదం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న తమను ఇప్పుడు పక్కనపెట్టి, వంట చేయకుండా అడ్డుకుంటున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాల వద్ద మహిళలు తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు అయినప్పటి నుండి మహిళ సంఘం సభ్యులమైన మేము భోజనం వండి పెడుతున్నామని తెలిపారు.
గత కొన్నేళ్లుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నామని మహిళలు తెలిపారు. అయితే ఇప్పుడు తమను కాదని కేవలం ఆరుగురు మహిళల చేత మాత్రమే వంట చేయిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు తమను కాదని కేవలం ఆరుగురు సభ్యులతోనే వంట చేయించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తాము కూడా వంట చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు అవకాశం కల్పించకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఎన్నో సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులకు భోజనం అందిస్తూ సేవలందించిన తమను ఒక్కసారిగా పక్కనపెట్టడం అన్యాయమని వారు వాపోయారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట కార్యక్రమంలో భాగంగా ఏర్పడిన వివాదం గొడవలకు దారితీస్తుందని, గ్రామంలో మహిళల మధ్య ఏర్పడిన వంట వివాదం ఇంటి మీదికి వెళ్లి దాడులు చేసుకునే పరిస్థితి కి వచ్చిందని ఆరోపించారు.
ఈ విషయంలో సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. గతంలో మాదిరిగానే తమకు కూడా వంట చేసే అవకాశం కల్పించాలని, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో పాఠశాల ప్రాంగణం లో నిరసన కార్యక్రమాలు చేస్తామని మహిళలు పేర్కొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Midday meal | నారాయణగిరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట వివాదం
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు
Sircilla | రౌడీ, హిస్టరీ షీటర్లపై పోలీసుల నిఘా.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
Building Collapses: ఢిల్లీలో కూలిన మూడు అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
Ram Charan | రూ.400 కోట్లతో రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్‌పై కొనసాగుతున్న సస్పెన్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

