Sircilla | రౌడీ, హిస్టరీ షీటర్లపై పోలీసుల నిఘా.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
Sircilla | రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై రాజన్న సిరిసిల్ల పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి వారి ప్రస్తుత కార్యకలాపాలు, జీవన విధానం, కదలికలపై ఆరా తీశారు.
Sircilla | రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై రాజన్న సిరిసిల్ల పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి వారి ప్రస్తుత కార్యకలాపాలు, జీవన విధానం, కదలికలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా నేర ప్రవృత్తికి దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనతో జీవించాలని వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రశాంత జీవనం సాగించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో జీవిస్తున్న వారిని గుర్తించి నిబంధనల ప్రకారం షీట్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
పోలీసు అధికారులు సూచించిన సమయాల్లో సంబంధిత వ్యక్తులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బైండోవర్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, నేరాలకు పాల్పడే వారు ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | రౌడీ, హిస్టరీ షీటర్లపై పోలీసుల నిఘా.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
Building Collapses: ఢిల్లీలో కూలిన మూడు అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
Ram Charan | రూ.400 కోట్లతో రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్‌పై కొనసాగుతున్న సస్పెన్స్!
The Greatest | ఓటీటీలోకి వచ్చేసిన ముహమ్మద్ అలీ బయోపిక్ సిరీస్ ‘ది గ్రేటెస్ట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Ramayana Review | రామాయణం రివ్యూ: రణ్‌బీర్-సాయిపల్లవిల ‘రామాయణ – 1’ మెప్పించిందా?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

