Ram Charan | రూ.400 కోట్లతో రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్‌పై కొనసాగుతున్న సస్పెన్స్!
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో, మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో, మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్లో కనిపించిన చిన్న సంకేతం ఆధారంగా సినిమా కథ, రామ్ చరణ్ పాత్రపై అభిమానులు రకరకాల అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో చరణ్‌ను సుకుమార్ ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమా బడ్జెట్ గురించి ఫిల్మ్ నగర్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు టీ-సిరీస్ ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. ‘పుష్ప-2’తో సుకుమార్ సాధించిన భారీ విజయంతో పాటు రామ్ చరణ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఖర్చు విషయంలో వెనుకాడటం లేదనే టాక్ వినిపిస్తోంది. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర నిర్మాణ వ్యయాలు ఈ బడ్జెట్లో కీలకం కానున్నాయి. అయితే రూ.400 కోట్ల బడ్జెట్‌పై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. పూజా కార్యక్రమాల సమయంలోనే కథానాయిక పేరును ప్రకటిస్తారని అభిమానులు భావించినప్పటికీ, అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. మొదట కొంతమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ, కథలో మార్పుల నేపథ్యంలో మళ్లీ కొత్తవారి కోసం అన్వేషణ సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడి విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం ఒక ప్రత్యేకమైన కాంబినేషన్‌గా కొనసాగుతోంది. మరి ఈసారి కూడా దేవిశ్రీనే ఎంపిక చేస్తారా? లేక మరో సంగీత దర్శకుడికి అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | రూ.400 కోట్లతో రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్‌పై కొనసాగుతున్న సస్పెన్స్!
The Greatest | ఓటీటీలోకి వచ్చేసిన ముహమ్మద్ అలీ బయోపిక్ సిరీస్ ‘ది గ్రేటెస్ట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Ramayana Review | రామాయణం రివ్యూ: రణ్‌బీర్-సాయిపల్లవిల ‘రామాయణ – 1’ మెప్పించిందా?
Mahasakthi | నయనతార ‘మహాశక్తి’కి తెలుగులో గట్టి పరీక్ష.. రేపే థియేటర్లలోకి, పోటీగా ‘రామాయణ’, ‘సీన్’!
Walking | కండరాలు దృఢంగా మారాలంటే వాకింగ్ సరిపోతుందా.. దీంతో ఏం జరుగుతుంది..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

