చిలుకూరు, జనవరి 1 : దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సహకార ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. పీఏసీఎస్‌ల్లో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత ఇవ్వాలని ప్రభుత్వానికి అర్జి పెట్టుకోగా సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. జీఓ నెంబర్ 44ప్రకారం 2009నుంచి 2019 మార్చి 30వరకు నియమితులైన సిబ్బందికి ఉద్యోగ భద్రతతో పాటు జీతం రూ.5వేల నుంచి రూ.15వేలకు వరకు పెరిగే అవకాశముంది. దీంతో పీఎసీఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
450మందికి ప్రయోజనం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డీసీసీబీ పరిధిలో 117పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటిలో సుమారుగా 450మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జీఓ 44ప్రకారం పీఏసీఎస్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు జీతం, హెచ్ఆర్ వంటి పాలసీలు అందే అవకాశముంది.
ప్రత్యేక బోర్డుతో నియామకాలు
గత ప్రభుత్వాల్లో పీఏసీఎస్‌లో సిబ్బందిని పార్టీల పరంగా, అధ్యక్షుడికి దగ్గర బంధువులనే నియమించుకునేది. కానీ జీఓ 44ప్రకారం పీఏసీఎస్‌ల్లో నూతన సిబ్బంది నియామకానికి పాలకవర్గంతో సంబంధం లేకుండా ప్రత్యేక బోర్డుతో అన్ని అర్హతలు ఉన్న వారినే నియమించుకోవడంతో పీఏసీఎస్‌ల్లో సిబ్బంది మరింత కష్టపడుతుండటంతో సంఘాలు లాభాల బాటలో నడుస్తాయి.
సీఈఓ హోదా మార్పు
ఇప్పటివరకు పీఏసీఎస్ సీఈఓగా ఉన్న పేరును కార్యదర్శిగా మార్చారు. డీసీసీబీ నియామకాల్లో పీఏసీఎస్‌లో పని చేస్తున్న సిబ్బందికి 2శాతం రిజర్వేషన్లతో పాటు మెయింటెన్స్ గ్రాట్యూటీ రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు పెంచారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
పీఏసీఎస్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు హెచ్ఆర్ పాలసీ అమలుపై సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఎన్నో ఏండ్లుగా పోరాటం చేస్తున్న తమకు ప్రభుత్వం తీపికబురు అందించింది. దీంతో ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు.
– చిలువేరు లక్ష్మీనారాయణ, సీఈఓ, చిలుకూరు
సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
సహకార ఉద్యోగులకు జీఓ నెంబర్44తో ఉద్యోగ భద్రత కల్పించడం సీఎం కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. గత ప్రభుత్వాలు చేయని పనిని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందనడానికి జీఓ నెంబర్44 నిదర్శనం.
– అల్సకాని జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్, చిలుకూరు.