న్యూయార్క్, డిసెంబర్ 7: మల విసర్జన గురించి బయటకు మాట్లాడటానికి కూడా ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అయితే, మన ఆరోగ్య పరిస్థితి, జీర్ణక్రియ, గట్ హెల్త్(జీర్ణాశయ వ్యవస్థ ఆరోగ్యం), సాంక్రమిక వ్యాధులు చాలావరకు మల విసర్జన తీరుపైనే ఆధారపడి ఉంటుందని అమెరికాకు చెందిన పరిశోధకులు చెప్తున్నారు. సియాటిల్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీ(ఐఎస్బీ) పరిశోధకులు చేసిన అధ్యయనం వివరాలు ‘సెల్ రిపోర్ట్స్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 3,600 మందిని నాలుగు విభాగాలుగా విభజించి వీరు స్టడీ చేశారు. మలబద్ధకం విభాగంగా, వారానికి మూడు నుంచి ఆరుసార్లు పోయే వారిని లో-నార్మల్ కేటగిరిగా, రోజుకు ఒకటి నుంచి మూడుసార్లు పోయేవారిని హై-నార్మల్ కేటగిరిగా, రోజుకు నాలుగుసార్లు, అంతకంటే ఎక్కువసార్లు మల విసర్జన చేసే వారిని డయేరియా కేటగిరిగా విభజించారు.
అధ్యయనంలో తేలిన అంశాలు: