రామాయంపేట, జూన్ 6 : రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో శనివారం చోటుచేసుకున్నది. రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం.. రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం.. కోమటిపల్లికి చెందిన సంగం మహిపాల్ (30) శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో రామాయంపేట శివారులో లారీ మహిపాల్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రామాయంపేట పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రామాయంపేట ఎస్సై బాలరాజు తెలిపారు.